Wednesday 5 May 2021

శివ్నానది ఒడ్డున కొలువుదీరిన పశుపతినాథుడు


#మనదేవాలయాలు_మనసంపద 
#మనదేవాలయాలు 
#దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి 

ప్రతి నిత్యం దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం మన దేవాలయ లు గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://www.facebook.com/groups/2185637145027700/?ref=share

మన దేవాలయాలు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.సమాచారం అందరితో షేర్ చేయండి.

https://t.me/joinchat/GfLCAnisG1gSQZkc

శివ్నానది ఒడ్డున కొలువుదీరిన పశుపతినాథుడు
 శివ్నానది మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని మంద్ సౌర్ పట్టణంలో ఉంది. ఈ నదీ తీరంలో ప్రపంచంలో మరెక్కడా లేని మూర్తిగా అష్టముఖాలతో ఈశ్వరుడు భక్తకోటిచే పూజలు అందుకుంటున్నాడు.

500 ఏళ్ల క్రిందట శివ్నానది వడ్డుగల పెద్ద బండరాయి వద్దకు ఒక రజకుడు రోజూ బట్టలు ఉతుక్కోవడానికి వెళుతుండేవాడట. ఒక రోజు అతనికి శివుడు కలలో కనిపించి ఆ చోట బట్టలు ఉతకడం మానేసి అక్కడ తనను వెలికి తీసి గుడి కట్టమని ఆ మూర్తిని
దర్శించుకొన్నవారికి మోక్షప్రాప్తి కలుగుతుందని తెలియజేసాడట. మరునాడు ఆ రజకుడు తనతోటి వారితో వెళ్ళి, అక్కడ తవ్విచూడగా స్వామి విగ్రహం కనిపించింది. దాంతో అక్కడే విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారట. ఈ స్వామి వేల ఏళ్లక్రితమే ఇక్కడ వెలిసినా 1940 వేసవి వరకు శివ్నానది నీటిలో మునిగే ఉన్నాడు పశుపతినాథుడు. నది నీటమట్టం తగ్గడంతో భక్తులకు పూర్తి రూపంతో 1961లో దర్శనం ఇచ్చాడు.

ఆ మరుసటి యేడు అత్యంత ఘనంగా స్వామి ఆలయ పునరుద్దరణ జరిగింది. ఆ తరువాత పార్వతి, గణేశ, కార్తికేయ, గంగ, విష్ణు, లక్ష్మి, ఆదిశంకరాచార్య మూర్తులను ప్రతిష్టించారు. ఇక్కడ స్వామిని అందరూ చేత్తో స్పర్శించవచ్చు. మహాశివరాత్రికి రుద్రాభిషేకం బిల్వపత్రాలతో పూజలు జరుపుతారు. మంద్ సౌర్ పట్టణంలోని శివ్నానదికి 90 అడుగుల ఎత్తులో, 30 అడుగుల విస్తీర్ణంలో 101 అడుగుల పొడవుతో పశుపతినాథ్ దేవాలయం అత్యంత నయనానందకరంగా భాసిల్లుతుంది. దేవాలయంపైన 100 కిలోల స్వర్ణంతో చేసిన గోపుర భాగం సూర్యకిరణాల కాంతితో మెరుస్తూ భక్తులను అలౌకికమైన ఆనందానికి చేరువ చేస్తుంది. ఎక్కడాలేని విధంగా ఈ ఆలయానికి నాలుగువైపులా నాలుగు మహాద్వారాలు ఆశ్చర్యపరుస్తాయి. భక్తులంతా పశ్చిమ మహాద్వారం ద్వారానే లోపలికి వెళతారు.

భవ, పశుపతి, మహాదేవ, ఈశాన, రుద్ర, వర్వ, అశని, రూపాల ముఖాలతో స్వామి భక్తులచే పూజలు అందుకోవడం అక్కడ ప్రత్యేకత. ఇక్కడ స్వామికి జలమే జలాభిషేకం చేయడం ఇక్కడ అరుదైన ఘటన.

ప్రతి వర్షాకాలం శివ్నానది 90 అడుగులు ఉప్పొంగి ఆ నది శివలింగం అగ్ర భాగాన్ని తాకుతూ ప్రవహిస్తుంది. ఈ కాలంలో ఈ ప్రాంతాన్ని దూరం నుంచే వేలాది మంది భక్తులు ఈ అద్భుత దృశ్యానికి పులకించి పోతుంది.

Tuesday 4 May 2021

Kamandala Ganapathi Temple


#గణపతి_దేవాలయాలు 
#గణపతి
#ప్రతి_ఒక్కరూ_తప్పకుండ_షేర్_చేయండి
#అందరికీ_తెలిసేలా_షేర్_చేయండి 
#మనదేవాలయాలు_మనసంపద
#కమండలగణపతి

ప్రతి ఒక్కరు షేర్ చేయండి అందరికి తెలిసేలా చేయండి..మీరు చేసే గొప్ప సహాయం అదే.

ప్రతి నిత్యం దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం మన దేవాలయ లు గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://www.facebook.com/groups/2185637145027700/?ref=share

మన దేవాలయాలు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.సమాచారం అందరితో షేర్ చేయండి.

https://t.me/joinchat/GfLCAnisG1gSQZkc

కమండల గణపతి దేవాలయం 
----------------------------------------------

కర్ణాటక రాష్ట్రం, చిక్కమగళూరు జిల్లా నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కమండల గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు.ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, శని వక్రదృష్టి కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొన్న పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయాలనీ భావించి శివుడి కంటే ముందుగా గణపతిని ప్రార్దించినదట, అప్పుడు బ్రహ్మచారి రూపంలో వినాయకుడు ఒక తిర్దాన్ని సృష్టించాడని పురాణం. ఇలా వినాయకుడు బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి కనిపించిన వినాయకుడు సృష్టించిన తిర్దాన్ని బ్రహ్మ తీర్థం అని, కమండలం ధరించి దర్శనమిచ్చిన గణపతిని కమండల గణపతి అనే పేరు వచ్చినది స్థల పురాణం. ఇక్కడే పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు.

ప్రతి నిత్యం దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం..

మనదేవాలయలు May సంచిక -2021

https://drive.google.com/file/d/1MYsyf0A7LHO1yK-BAgyRCauo1PybuB0C/view

Note:- ప్రతి ఒక్కరూ subscribe చేసుకొని  శిథిలావస్తాలో ఉన్న దేవలయలలో ధూప దీప నైవైద్య కార్యక్రమాలకు చేయూత అందించండి.


IG:@manatemples
Twitter:@manatemples
Whatsapp:
https://chat.whatsapp.com/1VYxGud4H0VG8q2ayTXR4T

మీ శ్రేయోభిలాషి
గిరీష్
www.manatemples.in
91-9866933582

Wednesday 24 March 2021

తెనాలి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి



తెనాలి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి  సంధర్భంగా 
శ్రీ వారికి  లక్ష తులసీ దళార్చన మహోత్సవం
తెనాలి వైకుంఠపురం క్షేత్రము



Friday 5 March 2021

శ్రీచిదంబరేశ్వరస్తోత్రం

శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం

కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీవామభాగమ్ |
సదాశివం రుద్రమనంతరూపం చిదంబరేశం హృది భావయామి || ౧ ||

వాచామతీతం ఫణిభూషణాంగం గణేశతాతం ధనదస్య మిత్రమ్ |
కందర్పనాశం కమలోత్పలాక్షం చిదంబరేశం హృది భావయామి || ౨ ||

రమేశవంద్యం రజతాద్రినాథం శ్రీవామదేవం భవదుఃఖనాశమ్ |
రక్షాకరం రాక్షసపీడితానాం చిదంబరేశం హృది భావయామి || ౩ ||

దేవాదిదేవం జగదేకనాథం దేవేశవంద్యం శశిఖండచూడమ్ |
గౌరీసమేతం కృతవిఘ్నదక్షం చిదంబరేశం హృది భావయామి || ౪ ||

వేదాంతవేద్యం సురవైరివిఘ్నం శుభప్రదం భక్తిమదంతరాణామ్ |
కాలాంతకం శ్రీకరుణాకటాక్షం చిదంబరేశం హృది భావయామి || ౫ ||

హేమాద్రిచాపం త్రిగుణాత్మభావం గుహాత్మజం వ్యాఘ్రపురీశమాద్యమ్ |
శ్మశానవాసం వృషవాహనస్థం చిదంబరేశం హృది భావయామి || ౬ ||

ఆద్యంతశూన్యం త్రిపురారిమీశం నందీశముఖ్యస్తుతవైభవాఢ్యమ్ |
సమస్తదేవైః పరిపూజితాంఘ్రిం చిదంబరేశం హృది భావయామి || ౭ ||

తమేవ భాంతం హ్యనుభాతిసర్వమనేకరూపం పరమార్థమేకమ్ |
పినాకపాణిం భవనాశహేతుం చిదంబరేశం హృది భావయామి || ౮ ||

విశ్వేశ్వరం నిత్యమనంతమాద్యం త్రిలోచనం చంద్రకలావతంసమ్ |
పతిం పశూనాం హృది సన్నివిష్టం చిదంబరేశం హృది భావయామి || ౯ ||

విశ్వాధికం విష్ణుముఖైరుపాస్యం త్రిలోచనం పంచముఖం ప్రసన్నం |
ఉమాపతిం పాపహరం ప్రశాంతం చిదంబరేశం హృది భావయామి || ౧౦ ||

కర్పూరగాత్రం కమనీయనేత్రం కంసారిమిత్రం కమలేందువక్త్రమ్ |
కందర్పగాత్రం కమలేశమిత్రం చిదంబరేశం హృది భావయామి || ౧౧ ||

విశాలనేత్రం పరిపూర్ణగాత్రం గౌరీకలత్రం హరిదంబరేశమ్ |
కుబేరమిత్రం జగతః పవిత్రం చిదంబరేశం హృది భావయామి || ౧౨ ||

కళ్యాణమూర్తిం కనకాద్రిచాపం కాంతాసమాక్రాంతనిజర్ధదేహమ్ |
కపర్దినం కామరిపుం పురారిం చిదంబరేశం హృది భావయామి || ౧౩ ||

కల్పాంతకాలాహితచండనృత్తం సమస్తవేదాంతవచోనిగూఢమ్ |
అయుగ్మనేత్రం గిరిజాసహాయం చిదంబరేశం హృది భావయామి || ౧౪ ||

దిగంబరం శంఖసితాల్పహాసం కపాలినం శూలినమప్రయేమ్ |
నాగాత్మజావక్త్రపయోజసూర్యం చిదంబరేశం హృది భావయామి || ౧౫ ||

సదాశివం సత్పురుషైరనేకైః సదార్చితం సామశిరస్సుగీతమ్ |
వైయ్యాఘ్రచర్మాంబరముగ్రమీశం చిదంబరేశం హృది భావయామి || ౧౬ ||

చిదంబరస్య స్తవనం పఠేద్యః ప్రదోషకాలేషు పుమాన్ స ధన్యః |
భోగానశేషాననుభూయ భూయః సాయుజ్యమప్యేతి చిదంబరస్య || ౧౭ ||

ఇతి శ్రీచిదంబరేశ్వరస్తోత్రం సంపూర్ణమ్ |

Thursday 4 March 2021

రాకంచెర్ల వెంకట దాసుల వారు: Rakamcherla Venkata Dasula Vaaru

#రాకమచెర్ల
#రాకమచెర్లవెంకటదాసులవారు
#రాకమచెర్లయోగనందనరసింహాస్వామిదేవాలయం
#వెంకటదాసులవారికీర్తనలు
#రాకమచెర్లభజనకీర్తనలు
గురువారం-ప్రత్యేకం
---------------------------

రాకంచెర్ల వెంకట దాసుల వారు: Rakamcherla Venkata Dasula Vaaru
--------------------------------------------------------------

రాకమచెర్ల వెంకట దాసుల వారు గొప్ప వాగ్దేయకారుడు.అన్నమాచార్యులు,రామదాసు అంత గొప్ప చరిత్రకారుడు,జ్ఞాని,భక్త సులబుడు.
తన జీవితమంతా హరినామ స్మరణతో జీవితం గడిపి ప్రజలలో దైవ చింతన,భక్తితో మేల్కొలుపే వాడు.

వెంకటదాసుల వారు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పుడూర్ మండలం లో గల రాకమచెర్ల గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని ఒక పీఠాన్ని స్థాపించి తన జీవితాన్ని దైవం లో లీనం చేశారు.చీమలు ఒక రాయిని యోగనంద నర్సింహుని గా మలిచాయి.కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దివ్య క్షేత్రమిది.

కొన్ని వేల కీర్తనలను అయిన రాసినారు.దాంట్లో కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి.దాసుల వారు నెలకొల్పిన పీఠానికి అధిపతులగా మా వంశస్థులు అనాదిగా ఉంటూ అయిన భక్తి పరంపర ను కొనసాగిస్తూ ప్రజలను ఆధ్యాత్మికం వైపు నడిపిస్తున్నారు!

ఇప్పటికి మా స్వగ్రామం లో ఉన్న తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు అయిన రాసిన కీర్తనలను భజన గా చేస్తూ స్వామి వారి సేవ కార్యక్రమలు నిర్వహిస్తారు.

ప్రతి ఒక్కరు ఇ క్షేత్రాలను దర్శించి స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు.


తెలంగాన సాంస్కృతిక శాఖ వాళ్ళు బాగా అధ్యయనం చేసి చరిత్ర మరిచిపోయిన గొప్ప వాగ్దేయకారుడిని ప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం చేయాలి.

వేళ్ళు మార్గం:హైదరాబాద్ నుండి పరిగి, కొడంగల్,సెడం,యాదగిరి, గుల్బర్గా వెళ్లే బస్ లు రాకమచెర్ల సమీపం నుండి వెళుతాయి.

గమనిక; మిత్రులందరికీ విజ్ఞప్తి ప్రతి ఒక్కరు మంచి విషయాన్ని అందరితో పంచుకొని ఒక గొప్ప వాగ్గేయకారుడు గురుంచి ప్రపంచానికి తెలియ చేసే ప్రయత్నం చేద్దాం!

#పెద్దఉమ్మెంతల్
#తిరుమలనాథస్వామి
#గోవిందయ్యగారు
#rakamcherla
#rakamcherlavenkatadasulavaaru
#rakamcherlakirthanalu

ఇట్లు మీ శ్రేయోభిలాషి
Girish
www.manatemples.in
9866933582